దేవుడా,
చెప్పుకోవడానికి జాబ్ ఇచ్చావ్,
చూపించడానికి ఐడి కార్డ్ ఇచ్చావ్,
ఫ్రీ గా ఈఛీఛీ బ్యాంకు అక్కౌంటు ఇచ్చావ్ (కచ్చితంగా ఈఛీఛీ కాదు, ఎవరికి ఏ బ్యాంకు ఐతే అది)
ప్రతి నెలా జీతం కూడా ఇచ్చావ్
దేవుడా,
కూర్చోవడానికి కుర్చీ ఇచ్చావ్,
ఉండడానికి క్యుబికల్ ఇచ్చావ్,
మెయిల్ చెయ్యడానికి కంప్యూటర్ ఇచ్చావ్,
చాట్ కి జీ టాక్ ఇచ్చావ్,
దేవుడా,
కాలీ గా వుంటే కఫీ మిషను ఇచ్చావ్,
టైం పస్ కోసం టర్మినల్ ఇచ్చావ్,
లంచ్ కోసం ఫూడ్ కోర్ట్ ఇచ్చావ్,
పంచ్ కోసం అప్పుడప్పుడు హెల్త్ క్లబ్ కూడా ఇచ్చావ్,
కానీ,,, ఏందుకు నన్ను బెంచ్ మీద వుంచావ్,
ఐనా నువ్వు నాకు నచ్చావ్..
నచ్చావ్....నచ్చావ్.... అంతే
4 comments:
భలే ఉందండీ కవిత!
ఒక్క చిన్న కవితలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల వాతావరణాన్ని మొత్తం ఒక డాక్యుమెంటరీలాగా ప్రదర్శించేశారు. మీ కవిత నాలుగు ఖండాలలో నాలుగు పేజీలకు సరిపడా విషయాన్ని కుదించారు. బెంచీ మీద ఎందుకు కూర్చోబెట్టావు దేవుడా? కోడ్లు కాదు. కవితలు వ్రాయమని.
హహ...
బెంచే లేకపోతే అవన్నీ వాడేవారు ఎవరూ ఉండరని :)
బాగా రాసారు. మాది ఐసి-యూసి బ్యాంకు.
Post a Comment