ఆంధ్రజ్యోతి లొ చదివిన వార్తకు స్పందనగా....మన ఆంధ్రప్రదేశ్ లొ అరడజనుకు పైగా వార్తా చానెల్లు ఉన్నాయి. వాటిలొ 'మెరుగైన సమాజం' కోసం మొదలు పెట్టినవి యెంత వరకు సమాజం గురించి ఆలోచిస్తున్నాయి.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం, ఇంజనీరింగు కళాశాలలొ ఓ విద్యార్థి ని సీనియర్లు దారుణంగా ర్యాగింగు చేసారు. అతని బట్టలు విప్పించి తీవ్ర అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వాటిని వీడియో తీసారు.ఓ టి.వి చానలు వాటిని రోజంతా ప్రసారం చేసింది.ఆ విద్యార్థి బాధతో అరుస్తున్న దృశ్యాలను అందరికి ప్రదర్శించి చూపింది.దానితో మనస్తాపం చెంది అతని తల్లి ఆత్మహత్య చేసుకొంది.
కొన్ని నేలల క్రితం, కిరణ్ కుమార్ అనే విద్యార్థి అమెరికాలో హత్యకు గురయ్యాడు. ఆ సంగతి తెలిసి పలు టి.వి చానళ్ల రిపొర్టర్లు అతని బాబాయి ఇంటికి చేరుకున్నారు. కాసేపటికి ఆ విద్యార్థి సొదరి ఇంటికి వచ్చారు. సొదరుడి మరణ వార్త విని విళపించడం ప్రారంభించారు. టి.వి చానళ్ల రిపొర్టర్లు "ఇటు తిరిగి ఏడవండి మేడం" అంటూ ఆమెని కోరారు.ఆమె ఏడుస్తున్న ద్యశ్యాలను చిత్రికరించి ప్రసారం చేయాలన్న అత్రమే తప్ప మనుషులు, వారి మనోభవాల గురించి ధ్యాసే వారికి లేకపొయింది.
ఇది కేవలం ఓక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఏన్నొ ప్రతి రోజూ వస్తున్నాయి. ఇదేనా సమాజం ను మెరుగుపరచే విధానం.ఇటువంటి టి.వి కార్యక్రమాలను నియంత్రించడానికి ప్రభుత్వం ఓక చట్టాని తీసుకు వచ్చి, వాటిని కచ్చితంగా అమలు చేయాలి.
1 comment:
అంతేనా.. ఒక సారి ఒకాయన ఏదో నిరసనలో భాగంగా శాశనసభా ప్రాంగణంలో వేలు కోసుకుంటాను అని అంటే మన మీడియా వాళ్ళు చుట్టూచేరి ఆపలేదు సరిగదా "ఇక కానివ్వండి" అన్నట్టూ కెమేరాలతో తయారయ్యరట. ఆయన మాట నిలబెట్టుకున్నారు మరి.
Post a Comment