ఓ టి.వి. చానలు నిర్వహిస్తున్న "ఆడువారి మాటలకు" అను కార్యక్రమం చూసారా. మీరు ఇప్పటి వరకు చూడనట్లేతే దయచేసి చూడకండి. నిన్న నేను ఆ కార్యక్రమం చూసిన తరువాత నా జీవితం పై నాకే విరక్తి కలిగింది.
ఈ కార్యక్రమం, అందులో పాల్గోన్న కుటుంబసభ్యుల మధ్య అనవసర కలహలను రేపుతోంది. ఇప్పటికే ప్రతి సిరియల్ లోను ఏడుపులు, కలహలు, కుట్రలు, కుతంత్రాల తో నిండి పోయాయి. ఇప్పుడు అది, గేం షో లకు కూడా ప్రాకింది. ఒవైపు పార్టిసిపేటు ఏడవడం, అది చూసి మిగిలిన వారు ఏడవడం, వారిని చూసి యాంకరు ఏడవడం, అలా ఏడ్చిన తరువాత యాంకరు , తను త్యాగం చేసినట్లు మధ్యలో వెల్లిపొవడం, విటిని చూస్తున్న మనకు జీవితంపై విరక్తి కలగడం , ఇలా ఈ సెంటి"మెంటల్" అనే చక్రం లొ పడి మనకు పిచ్చెక్కుతుంది.
No comments:
Post a Comment